VIDEO: ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

VIDEO: ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

ప్రకాశం: ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. ఒంగోలులోని కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన మండల అధికారుల వీడియో కాన్ ఫ్రెన్స్‌లో ఆమె మాట్లాడారు. వేసవిలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.