చెరువుగట్టులో 27న బహిరంగ వేలం: ఈవో మోహన్ బాబు
NLG: చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వివిధ హెచ్-1, ఎల్-1 వేలం హక్కులను పొందుటకు, ఈనెల 27న ఉ.11 గం.ల నుంచి గట్టుపైన వేలం వేయనున్నట్లు ఈవో సాల్వాది మోహన్ బాబు తెలిపారు. తలనీలాలు, పాదరక్షల భద్రపరచుట, పూలు, బ్లేడ్లు సప్లై, టికెట్ బుక్స్ ప్రింటింగ్ చేయుట తదితర హక్కులకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.