విద్యుత్ సౌకర్యం కల్పించాలని ధర్నా

ప్రకాశం: దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డుపై చిన్నారుట్ల గూడెం గిరిజనులు ధర్నాకు దిగారు. తమ గూడేనికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రాత్రివేళలో భయం గుప్పెట్లో జీవనం కొనసాగిస్తున్నామని వాపోయారు. ధర్నా సందర్భంగా ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.