పులివెందులలో రేపటి నుంచి ఆధార్ నమోదు కేంద్రాలు

KDP: పులివెందుల పట్టణంలో మంగళవారం నుంచి ఆధార్ నమోదు కేంద్రాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19, 20వ తేదీలలో నగరిగుట్టలోని జడ్పీ హైస్కూల్, 21, 22వ తేదీలలో రవణప్ప సత్రం స్కూల్, 23న జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్, ఎంజేపీఏపీ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.