నందిగం రాణికి బిగ్ షాక్
AP: విద్యా సంస్థల్లో భారీ మోసానికి పాల్పడిన నందిగం రాణికి బిగ్ షాక్ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. అయితే, ఈ కేసులో ఇప్పటికే నందిగం రాణి ఆస్తులను హోంశాఖ అటాచ్ చేసింది. ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ సైతం డిస్మిస్ కావడంతో ఆమెకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.