విషాదం.. చేపల వేటకు వెళ్లి అన్నదమ్ములు మృతి
MBNR: జిల్లా అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక చెక్ డ్యాం వద్ద చేపల వేటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సుధాకర్, సాయిలు అనే అన్నదమ్ములు నీటిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. ఇటీవలే తల్లి సంవత్సరీకానికి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.