'మే 20 న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి'

KMM: రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను పెంచాలని, ప్రయాణికులకు మెరుగైన భద్రత కల్పించాలని మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీ.ఐ.టీ.యు కోరింది. బుధవారం సీ.ఐ.టీ.యు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారావు ఆద్వర్యంలో మధిర రైల్వే స్టేషన్ మాస్టర్ సుధీర్ బాబుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.