సీఎంకి స్వాగతం పలికిన కందుకూరు ఎమ్మెల్యే
NLR: MSME పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు కనిగిరికి సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఈమేరకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. MSME పార్కుల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. త్వరలో కందుకూరులో కూడా ఇలాంటి పార్కు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.