ప్రత్యేక అలంకరణలో నరసింహస్వామి

KDP: పెండ్లిమర్రి మండలం వేయినూతుల కోనలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాస శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.