VIDEO: పౌర్ణమి సందర్భంగా నరసింహ స్వామి దేవస్థానంలో పూజలు
SRCL: పౌర్ణమి సందర్భంగా తంగళ్ళపల్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భక్తులు పూజలు నిర్వహించారు. దేవుడికి అభిషేకాలు చేసి గిరి ప్రదక్షిణలు చేశారు. అనంతరం దేవుడికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా అంటూ స్వామివారి గరుడ వాహనాన్ని ఎత్తుకొని గుడి చెట్టు ప్రదక్షిణలు చేశారు.