'రాయితీ క్రేట్లను వినియోగించుకోండి'
NRML: జిల్లాలోని ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై ప్లాస్టిక్ క్రేట్లను అందిస్తోందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి రమణ తెలిపారు. కూరగాయలు, మామిడి ఇతర పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంట కోత అనంతరం రవాణాలో జరిగే నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.