ఆన్‌లైన్ లావాదేవీలపై గిరిజనులకు ఎస్సై అవగాహన

ఆన్‌లైన్ లావాదేవీలపై గిరిజనులకు ఎస్సై అవగాహన

PPM: ఆన్‌లైన్ లావాదేవీల పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని వీరఘట్టం ఎస్సై షణ్ముఖరావు సూచించారు. శుక్రవారం మండలంలోని మూలలంక, గోపాలపురం, చిన్న గోరగిరిజన గ్రామాల్లో సైబర్‌ నేరాలపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం SI మాట్లాడుతూ.. అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు గానీ ఫోన్‌కు వచ్చే OTPలు గాని చెప్పవద్దని సూచించారు. అవసరానికి మాత్రమే మొబైల్‌ వినియోగించాలన్నారు.