తామరపల్లిలో దోమతెరల పంపిణీ
ASR: తామరపల్లి పంచాయతీ హెల్త్ సెంటర్‌లో సోమవారం దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు దోమతెరలను ముందుగా నీటిలో నానబెట్టి, నీడలో ఆరబెట్టి వాడాలని సూచించారు. దోమతెరల వాడకం వల్ల మలేరియా వంటి జ్వరాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఇంటి, గ్రామ పరిశుభ్రతపై దృష్టి పెట్టడంతో పాటు ఎండాకాలంలో అవసరం అయితే తప్ప బయట తిరగొద్దని సూచించారు.