అంబులెన్స్ వాహనంలో ప్రసవించిన మహిళ

అంబులెన్స్ వాహనంలో ప్రసవించిన మహిళ

KMM: తిరుమలాయపాలెం మండలం జూపెడకు చెందిన గర్భిణి అనిత నిన్న రాత్రి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. కాగా.. ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువ కావడంతో, 108 వాహనంలోని ఈఎంటీ పుష్పలత డెలివరీ చేశారు. దీంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పైలెట్ ఆజీముద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది సేవలను పలువురు అభినందించారు.