నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
SRD: మునిపల్లి మండలం బుదేరా రైతు వేదికలో మంగళవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు దారి తీయకుండా సవ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.