నేటి నుండి వర్షాలు.. రైతుల్లో ఆందోళన

KKD: నేటి నుండి మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసె అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమశాతం తగ్గించేందుకు ధాన్యాన్ని ఆరబోస్తుండగా సాయంత్రం వేళ వాతావరణం మేఘావృతమై కనిపిస్తుండటంతో రైతులు గుబులు చెందుతున్నారు.