'ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం తగదు'
అన్నమయ్య: గాలివీడు మండలంలో కొత్తగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపులో మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబీర్ గురువారం ఆరోపించారు. డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఐడీ కేటాయింపు, సర్వీస్ బుక్ ప్రారంభం వంటి సాంకేతిక ప్రక్రియలు ఆలస్యం కావడంతో సగం మందికి జీతాలు అందడం లేదని తెలిపారు.