ప్రజల నుంచి వినతలు స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ఇవాళ పెదవేగి మండలంలోని దుగ్గిరాల క్యాంపు కార్యాలయం పలు సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.