VIDEO: మంత్రి ఇలాకాలో యూరియా కష్టాలు

KMM: తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా ఇవ్వడం లేదని కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లేపల్లి సొసైటీ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా దొరకడం లేదన్నారు.