'మోవానా' తెలుగు ట్రైలర్ వచ్చేసింది
2016లో సంచలనం సృష్టించిన హాలీవుడ్ యానిమేషన్ చిత్రం 'మోవానా' ఇప్పుడు లైవ్-యాక్షన్ రూపంలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ 2026, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తన ద్వీపాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి, శక్తివంతుడైన మౌయి సాయంతో చేసే సాహసయాత్రే ఈ చిత్ర కథాంశం.