ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విజయనగరం మండలం మలిచర్ల, సుంకరిపేట గ్రామాలలో ఇవాళ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు, చర్మ సంబంధ పరీక్షలు చేసి వైద్యుల సలహా మేరకు అవసరమైనవారికి ఉచితంగా మందులు అందజేశారు. పీ-4లో భాగంగా ఈ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ఆమె తెలిపారు.