US సైన్యం కదలికలపై చైనా ఏఐ నిఘా
అమెరికాతో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో US సైనిక మోహరింపులు, యుద్ధ విమానాలు, నౌకల కదలికలు, సైనిక స్థావరాలు వంటి వాటిని చైనా కంపెనీలు ఏఐను వాడి ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ దేశ సైనిక ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు సమాచారం. అనంతరం ఈ వివరాలను ఇరాన్‌కు చైనా అందిస్తుందట.