అకాల వర్షం.. అపార పంట నష్టం!
SKLM: ఎచ్చర్ల నియోజకవర్గ పరిధిలో ఈ నెల 6న కురిసిన ఈదరుగాలల వల్ల ఎక్కడిక్కడ పంటలు ధ్వసం అయ్యింది. లావేరు, రణస్థలం, జి. సిగడాం మండలాల్లో మొక్కజొన్న అరటి, బొప్పాయి పంటలు, రాగులు తదితర వాణిజ్య పంటలకు సుమారు 3వేల ఎకరాల్లో నష్టం వాట్టినట్లు సమాచారం. నష్టం వాటిల్లిన పంటను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.