'స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి'
MDK: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలిలు సత్తా చాటాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ పేర్కొన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో సమావేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ కిష్టయ్య, ఉడుత శ్రీమన్నారాయణ, వనం నరసింహులు పాల్గొన్నారు.