అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం

అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం

NZB: వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి మాత పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ఉదయం నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశామన్నారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించినట్లు చెప్పారు. తదుపరి హారతి, ప్రసాద వితరణ చేపట్టామన్నారు. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని వేడుకున్నారు.