పాలేరు రిజర్వాయర్‌ను సందర్శించిన BRS నాయకులు

ఖమ్మం: కుసుమాంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌ను బీఆర్ఎస్ నాయకులు ఆదివారం సందర్శించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ నామా నాగేశ్వరరావు రిజర్వాయర్‌ను సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సరిపడా సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.