హాస్టల్ నుంచి తప్పిపోయిన విద్యార్థి ఆచూకి లభ్యం
MNCL: చెన్నూరు MJP హాస్టల్ నుండి బుధవారం అదృశ్యమైన విద్యార్థి నాగవర్థన్ ఆచూకీ లభ్యమైంది. పోలీసులు జరిపిన గాలింపులో అతను ఇవాళ కరీంనగర్‌లో సురక్షితంగా దొరికాడు. ఫ్రెండ్ బర్త్‌డేకు వెళ్లానని, క్షేమంగా ఉన్నానని నాగవర్థన్ తన బంధువులకు ఫోన్ చేసి తెలిపాడు. చెన్నూరు పోలీసులు అతడిని స్వస్థలానికి తీసుకువస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.