25, 26న జర్నలిస్టుల ఎన్నికలు
అన్నమయ్య: మదనపల్లెలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో APWJF, APBJA జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 16 నుంచి 23 వరకు సభ్యత్వ నమోదు, 24న ఓటర్ల జాబితా విడుదల ఉంటుందన్నారు. 25న నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి చేసి సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తారు. 26న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.