నేటి నుంచి దరఖాస్తు ఆహ్వానం

ఏలూరు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షల రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం ఈనెల 24 నుంచి మే 1 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో చెల్లించాలన్నారు. మే 1 నుంచి 50 రూపాయల అపరాధ రుసుముతో పరీక్ష రోజు ముందు వరకు చెల్లించవచ్చన్నారు.