ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. అదృష్టమంటే వీళ్లదే!
ఈ వీడియోలో జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొట్టి, దాన్ని తన చక్రాల కింద నలిపేసింది. ఆ బైక్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. అయితే, దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు పక్కకి పడిపోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తలలు నలిగిపోయే పరిస్థితి నుంచి జస్ట్ మిస్‌లో బయటపడటం వారి అదృష్టమనే చెప్పాలి.