చేగువిరాకు నివాళులర్పించిన సీపీఎం నాయకులు

చేగువిరాకు నివాళులర్పించిన సీపీఎం నాయకులు

భద్రాద్రి: ఇల్లందు పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు చేగువేరా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ పార్టీ జిల్లా నాయకులు ఎస్ ఏ నబి మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన వ్యక్తి చేగువేరా అని ఆయన తెలిపారు. చేగువేరా పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమని అన్నారు.