అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి

VZM: అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్.కోట వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే లాగిన్ ఓపెన్ అయింది అన్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, వన్ బి వెంట తీసుకొని తమ పరిధిలో గల రైతు సేవా కేంద్రానికి వెళ్లాలని తెలిపారు.