మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్‌ను సన్మానించిన MRPS, MSP నేతలు
BHPL: మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ అంబాల శ్రీనివాసును శనివారం MRPS, MSP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్క అందజేసి.. శాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో MRPS, MSP రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, జిల్లా సీనియర్ నాయకులు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి తదితరులు ఉన్నారు.