VIDEO: ఇళ్ల స్థలాల కోసం కలెక్టరేట్‌ను ముట్టడించిన సీపీఐ
తిరుపతి రూరల్ ప్రాంత నిరుపేదలకు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని CPI ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 14 వేల పట్టాలలో 9 వేల పట్టాలకు ఇళ్ల స్థలాలు చూపించడంలో కలెక్టర్, చంద్రగిరి ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ పేదలతో CPI నగర కార్యదర్శి విశ్వనాథ్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.