తెప్పోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి
ATP: శింగనమల రంగరాయ చెరువులో 600 ఏళ్లుగా కొనసాగుతున్న శ్రీరామ, ఇతర దేవతల తెప్పోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి ప్రజలు సుఖశాంతులతో, రైతులకు సిరిసంపదలు కలగాలని ఆమె దేవుణ్ని కోరుకున్నారు. సొంత నిధులతో నిర్మించిన దుర్గ ఘాట్‌పై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు.