గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందజేత
MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన మునిగంటి నాగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉపాధి కోల్పోయాడు. ఇవాళ బాధిత కుటుంబానికి తొర్రూరు మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మామిండ్లపల్లి నగేష్ ఆధ్వర్యంలో రూ. 22వేల ఆర్థిక సాయం అందజేశారు. సంఘంలో ఉన్న సభ్యులకు ఎవరికీ ఆపద వచ్చిన సంఘం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.