BREAKING: జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత
HYD: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. HCAలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, సరైన అవకాశాలు ఇవ్వాలని పలు క్రికెట్ సంఘాలు నిరసనకు దిగాయి. పరిస్థితిని అదుపు చేయడానికి జింఖానా గ్రౌండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.