హౌస్ లిస్టింగ్ జనగణనపై కలెక్టర్ తనిఖీ
PDPL: పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం, సుల్తానాబాద్ పురపాలక సంఘంలో హౌస్ లిస్టింగ్ జనగణన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా నిర్వహించి, ల్యాండ్‌మార్క్‌లు, పాఠశాలలు, దేవాలయాలు, కార్యాలయాలను బ్లాక్ వారీగా నమోదు చేయాలని సూచించారు.