VIDEO: ‘బీచ్ రోడ్డు పనులు పూర్తి చేయాలి’
BPT: పెద్దపులుగు వారిపాలెం బీచ్ రోడ్డు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. 2021-23 మధ్య రెండు కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. ఆ తర్వాత పనులను ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోడ్డు పూర్తయితే పర్యాటకంగా బీచ్ అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు. తద్వారా జిల్లా కూడా ప్రగతి సాధిస్తుందని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.