చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!
పశ్చిమాసియా దేశాల యుద్ధంతో ప్రపంచ ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ ఆరామ్‌కో భాగస్వామ్యం కలిగిన చైనా రిఫైనరీ యూనిట్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ప్లాంట్ నిర్వహణ పనులను ప్రస్తుత సరఫరా సంక్షోభం దృష్ట్యా ముందే చేపడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.