ఎన్యుమరేటర్ల శిక్షణ పరిశీలించిన కలెక్టర్
MDK: జనగణన ప్రక్రియకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. టేక్మాల్ హై స్కూల్లో నిర్వహిస్తున్న సెన్సస్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఫీల్డ్ సిబ్బందికి జనగణన ప్రక్రియ, నియమాలు, బాధ్యతలపై అవగాహన కల్పించడం, డేటా సేకరణను సక్రమంగా నిర్వహించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.