భక్తిశ్రద్ధలతో స్వామివారి గంధం ఊరేగింపు

ATP: గుత్తిలో హజరత్ ఖాజా బంధ నవాజ్ గేసుద్రాస్ ఉరుసు ఉత్సవాల సందర్భంగా గురువారం స్వామివారి గంధాన్ని భక్తిశ్రద్ధలతో మేళా తాళాల నడుమ పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, చక్కెర చదివింపులు చేశారు. గురువారం రాత్రి దర్గా ఆవరణలో గొప్ప ఖవాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.