జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిప్పాయపాలెం వద్ద ఓ తుఫాను వాహనాన్ని అరటికాయలలోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే శ్రీశైల మల్లన్నను దర్శంచుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.