గిరిజన మహిళలకు వ్యవసాయ అవగాహన

గిరిజన మహిళలకు వ్యవసాయ అవగాహన

BDK: గిరిజన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీకృత వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని భద్రాచలం ఐటీడీఏ అధికారులు సూచించారు. శనివారం చర్ల మండలం కుర్నపల్లిలో మహిళా రైతు సంఘాలకు అవగాహన సదస్సు నిర్వహించి, కోళ్ల పెంపకం, చేపల సాగు వంటి వ్యవసాయ అనుబంధ పథకాలపై వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని కోరారు.