అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ స్పీకర్
SKLM: సారవకోట మండలం కోదడ్డ పనసలో కొలువై ఉన్న స్వయంభు శ్రీ అయ్యప్ప స్వామిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్‌ను మండల పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.