అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో AP హైకోర్టు న్యాయమూర్తి

KKD: జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, సత్యదేవుని ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి పండగ పూట సత్యనారణ స్వామిని దర్శించుకోవడం సంతషంగా ఉందని పేర్కొన్నారు.