అడ్డతీగలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

అడ్డతీగలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

ASR: అడ్డతీగల గ్రామంలోని కార్పెంటర్ కాలనీలో శుక్రవారం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో లైన్‌మన్‌లు సుబ్రమణ్యం, లోవరాజు వెంటనే స్పందించారు. ఏఈ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సిబ్బంది పనితీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేయగా, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని లైన్‌మన్‌లు కోరారు.