నవోదయ, సైనిక్ పాఠశాలలకు స్థల పరిశీలన
VKB: కొడంగల్ నియోజకవర్గంలో జవహర్ లాల్ నెహ్రూ నవోదయ, సైనిక్ పాఠశాలల నిర్మాణానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్థల పరిశీలన చేశారు. దుద్యాల మండలం హకీంపేట్‌లో ఏర్పాటు చేయనున్న ఎడ్యుకేషన్ హబ్‌కు కేటాయించిన 240 ఎకరాల్లో సైనిక్ పాఠశాల, పాత కోడంగల్ సమీపంలో నవోదయ పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.