యువకుడు అదృశ్యం.. కేసు నమోదు
SRD: సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన దత్తు (30) అనే యువకుడు ఎస్సై మహేష్ శుక్రవారం తెలిపారు. దత్తు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గత నెల దీపావళి పండుగకు ఇంటికి వచ్చారు. అక్టోబర్ 23న నాగనపల్లికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదని తల్లి పద్మావతి తెలిపారు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ తెలియరాలేదని, ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.