'తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఏం వస్తుంది'
VSP: కాశీబుగ్గ తొక్కసలాట ఘటనపై విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదాలు జరిగిన సమయంలో సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు మెచ్చుకుంటారని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఏం వస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.